HyderabadNotificationPoliticalTelangana

రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. జులై 15 నుంచే దరఖాస్తులు ప్రారంభం..

రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. జులై 15 నుంచే దరఖాస్తులు ప్రారంభం..

రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. జులై 15 నుంచే దరఖాస్తులు ప్రారంభం..

web desc : భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఉద్యోగాల భర్తీ కోసం మరో భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మొత్తం 119 సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టుల భర్తీకి సంక్షిప్త ప్రకటన (CEN No.03/2026) విడుదల చేసింది.

ఈ పోస్టులకు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ ప్రకారం జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. జులై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 బేసిక్‌ పే అందించనున్నారు.

మరోవైపు రైల్వే శాఖ జూన్‌ 30న దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మొత్తం 6,565 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ పోస్టులకు జూన్‌ 30 నుంచి జులై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. టెక్నీషియన్‌ పోస్టులకు టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పోస్టుల వారీగా అర్హతలు నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.

ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే? అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వైద్య పరీక్షలు మరియు ఇతర నిర్దేశిత ప్రక్రియల ఆధారంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో భారీ సంఖ్యలో ఖాళీలు భర్తీ కానుండటంతో ఉద్యోగార్థుల్లో ఆసక్తి నెలకొంది. రైల్వే ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే పూర్తి వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button