
మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా…
వికారాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని, అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కడియాల వేణుగోపాల్ ఆరోపించారు.
అనంతరం ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ కొండలరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కడియాల వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
అభివృద్ధి పనులపై అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని, ప్రతిపక్ష నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రజా ప్రతినిధులుగా తమకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మేకర్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు కమల్ రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, సంతోష్ కుమార్, కొట్పల్లి మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, మార్పల్లి మాజీ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, బూరుగుపల్లి శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి ఇస్మాయిల్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




