
సర్పై బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు..అందుకే బిల్లా, రంగాలు సర్పై కాకుండా సీఎంను టార్గెట్ చేస్తున్నరు: ఎంపీ చామల
web desc : స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్( సర్)పై బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ కుమార్ రెడ్డి ఆరోపించారు. అందుకే బిల్లా, రంగాలు(కేటీఆర్, హరీశ్ రావు) ఉదయం, సాయంత్రం మీటింగ్లు పెట్టి ఓట్ల తొలగింపుపై మాట్లాడకుండా.. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడమే టార్గెట్గా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో చామల మీడియాతో మాట్లాడారు.
ఇందులో సాధారణ ప్రజల ఓట్లు పోతాయనే ఆందోళన బీఆర్ఎస్ కు ఏమాత్రం లేదన్నారు. బీజేపీతో పాటు బీఆర్ఎస్ అనుకూల ఓట్లను తొలగించరని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే సర్ ప్రక్రియపై కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎల్ఏ) అప్రమత్తంగా ఉండాలన్నారు.
మరోవైపు తెలంగాణలో మ్యాపింగ్లోకి రాని కోటీ రెండు లక్షలు ఓట్ల వివరాలు తెలియడం లేదని ఎన్నికల సంఘం చెప్తుందన్నారు. అంటే రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో 33 శాతం ఓట్లు అంతు చిక్కడం లేదని అర్థమన్నారు.
మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళన, ట్రిపుల్ ఆర్, మెట్రో ఫేజ్2 ఇతర అభివృద్ధి అంశాలే ముఖ్యమన్నారు. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిబంధనలు పెట్టినా అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ఈ విషయంలో కేటీఆర్ చేస్తోన్న ఆరోపణలు అర్థరహితమని ఖండించారు. మెట్రో ఫేజ్1కు భూముల అప్పగింత, బీఆర్ఎస్ ప్రభుత్వ సహాయ నిరాకరణ కారణంగానే ఎల్ అండ్ టీపై అప్పుల భారం పడిందన్నారు. అందువల్లే ఆ సంస్థ మెట్రోను నిర్వహించలేక నష్టాల్లోకి వెళ్లిందన్నారు.




