
మోటార్ వైర్ల దొంగ పట్టివేత.. స్థానికుల చేతిలో దేహశుద్ధి
Web desc : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు ప్రాంతంలో మోటార్ వైర్ల దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ వెంచర్లో దొంగిలించిన మోటార్లను తీసుకువచ్చిన ఓ వ్యక్తి వాటిలోని కాపర్ వైర్లను వెలికితీయడానికి కాలుస్తుండగా స్థానికులు గమనించారు.
అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని దొంగను పట్టుకున్నారు. అనంతరం ఆగ్రహంతో అతనికి దేహశుద్ధి చేసినట్లు సమాచారం. ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది. మోటార్లు ఎక్కడి నుంచి దొంగిలించబడ్డాయి. ఈ ఘటనలో మరెవరైనా పాల్గొన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో మోటార్ వైర్లు, కాపర్ సామగ్రి దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా దొంగతనాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




