KhammamPoliticalTelangana

తీసుకున్న డబ్బులు ఇవ్వమని అడిగినందుకు CRPF కానిస్టేబుల్ దాడి...

తీసుకున్న డబ్బులు ఇవ్వమని అడిగినందుకు CRPF కానిస్టేబుల్ దాడి...

దాడి చేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలి…

మా అమ్మ నుండి తీసుకున్న 35 లక్షలు ఇప్పించాలి…

విలేకర్ల సమావేశంలో బాధితుల వేడుకోలు

సి కె న్యూస్ ప్రతినిది

ఖమ్మం, జూలై 4 : తీసుకున్న డబ్బులు ఇవ్వమని అడిగినందుకు దాడి చేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కేలోతు రమేష్ పై చర్యలు తీసుకుని, రూ…35 లక్షలు ఇప్పించాలని భాదితులు వేసుకున్నారు.

శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రఘునాధపాలెం మండలం జింకల తండా కు చెందిన బాణోత్ వాణి, బాణోత్ వెంకట్ మాట్లాడుతూ… తమ మాతృమూర్తి బాణోత్ పద్మ వద్ద ఖమ్మం గొల్లగూడెం రోడ్ లో ఉంటున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కేలోతు రమేష్ 35 లక్షలు అప్పు తీసుకున్నాడని తెలిపారు.

రమేష్ సొంత తమ్ముడు కావడంతో తమ అమ్మ మధ్యవర్తిగా ఉండి కొంతమంది నుండి రమేష్ కు అప్పు ఇప్పించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా రమేష్ తప్పించుకుని తిరుగుతున్నాడని, డబ్బులు ఇచ్చిన వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో గట్టిగా అడిగినట్లు తెలిపారు.

డబ్బులు ఇస్తామని కబురు చేయడంతో జూన్ 27న వెళ్లగా మా వద్ద ఉన్న ప్రాంసరి నోట్లు చింపేసి బెదిరించాడని, దీనిపై నిలదీయడంతో తమపై దాడి చేసారని వాణి ఆవేదన వ్యక్తం చేసారు. పురుగుల మందు తాగి చావాలంటూ డబ్బాను మా అమ్మపైకి విసిరేసి దుర్భాషలాడాడని తెలిపారు. మనస్తాపం చెందిన మా అమ్మ పద్మ పురుగు మందు తాగి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఖానాపురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసామని , వారం రోజులైనా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలిపారు. తమపై దాడి చేసిన రమేష్ పై చర్యలు తీసుకుని, అప్పుగా తీసుకున్న 35 లక్షలను ఇప్పించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button