Mahabub badPoliticalTelangana

పొగుళ్లపల్లి ప్యాక్స్: చైర్మన్ రేసులో ఎవరికి ఛాన్స్?

పొగుళ్లపల్లి ప్యాక్స్: చైర్మన్ రేసులో ఎవరికి ఛాన్స్?

పొగుళ్లపల్లి ప్యాక్స్: చైర్మన్ రేసులో ఎవరికి ఛాన్స్?

​మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ప్యాక్స్ (PACS) చైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది….. సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియలో జాప్యం నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సంఘాలకు నామినేటెడ్ ఇన్‌ఛార్జి కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీలో ఒక ఛైర్‌పర్సన్‌తో పాటు 12 మంది సభ్యులు ఉంటారు. వీరు ఆరు నెలల పాటు లేదా ఎన్నికలు జరిగే వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు….

ఈ నామినేటెడ్ పదవిని కైవసం చేసుకునేందుకు మండలానికి చెందిన పలువురు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలుస్తుంది…? అయితే, సహకార సంఘాల్లో పారదర్శకత ఉండాలని, అర్హులైన వారికే అవకాశం కల్పించాలని మంత్రి సీతక్క స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం…?

మంత్రి నిఘా, ఆదేశాల నేపథ్యంలో, అధికార పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందోనని మండలంలో ఆసక్తి నెలకొంది. ఎన్నికల వరకు ఈ పదవి దక్కించుకోవడం ద్వారా మండలం లో తమ పట్టును నిరూపించుకోవాలని ఆశిస్తున్న నేతలు, అధిష్టానం తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button