
చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
నల్లగొండ : తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజీరామారం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిన్న(శనివారం) పాఠశాల ముగిసిన అనంతరం మణి భార్గవ్(13) మరియు వినయ్(10) అనే ఇద్దరు బాలురు చేపలు పట్టేందుకు గాలాలు తీసుకొని గ్రామ సమీపంలోని బావి వద్దకు వెళ్లారు.
ఈ తరుణంలో ఇద్దరూ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయారు. ఈ విషయమై తిప్పర్తి సబ్ ఇన్‌స్పెక్టర్ వి.శంకర్ సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయంతో బావిలో మునిగి పోయిన ఇద్దరు బాలురను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి తదుపరి చర్యలు చేపట్టారు.




