
శేఖర్ మాస్టర్ తో కొట్లాటపై క్లారిటీ ఇచ్చిన జానీ మాస్టర్.. మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. వీడియో వైరల్..
Web desc : సోషల్ మీడియా లో నిన్నటి నుండి జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వాదించుకుంటున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వీళ్లిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే రేంజ్ గొడవలు జరిగాయని, అక్కడ పోలీసులు లేకపోయుంటే ఇద్దరూ కొట్లాడుకునేవారని , ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి.అయితే నేడు దీనిపై జానీ మాస్టర్ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు.
ఈ ప్రెస్ మీట్ కి జానీ మాస్టర్ సతీమణి సుమలత కూడా హాజరైంది. నాకు శేఖర్ మాస్టర్ తో ఎలాంటి గొడవలు లేవని , మేమిద్దరం అన్నదమ్ములు లాగానే ఉన్నామని, సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా నిన్న ఎందుకు గొడవ జరిగిందో కూడా ఆయన ఈ ప్రెస్ మీట్ లో వివరంగా చెప్పారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ ‘ఇక్కడ ఎవరికీ ఎవరూ శత్రువులు లేరు. మేమంతా మా యూనియన్, డ్యాన్సర్ల సంక్షేమం కోసమే పని చేస్తాము. వాళ్ళకోసం ప్రతీ సందర్భంలోనూ అడ్డంగా నిలబడుతాము. శేఖర్ మాస్టర్ తో నాకు ఎలాంటి గొడవలు లేవు. ఇప్పటికీ కూడా ఆయన నాకు ఏదైనా అవసరం ఉంటే నాకోసం పరిగెత్తుకుంటూ వస్తాడు , నేడు కూడా శేఖర్ మాస్టర్ కోసం వెళ్తాను.
సోషల్ మీడియా లో జరిగిన ఈ ప్రచారాన్ని చూసి చిరంజీవి గారు కూడా మాతో మాట్లాడారు. ఈరోజు మేమిద్దరం చిరంజీవి గారితో కలిసి భోజనం చేస్తూ , సరదాగా మాట్లాడుకున్నాం. అందుకు సంబంధించిన ఫోటోలను మీకోసం చూపిస్తున్నాను చూడండి. మేము ఎల్లప్పుడూ ఇలా అన్యోయంగానే ఉంటాము. మాకు చిరంజీవి గారు ఇచ్చే ప్రోత్సాహం సాధారణమైనది కాదు.
ఆయనే కాదు , ఇండస్ట్రీ లో ఉన్నటువంటి హీరోలు , టెక్నీషియన్స్ మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఈరోజు మాలాంటి డ్యాన్స్ మాస్టర్స్ కి మంచి గుర్తింపు ఉందంటే అందుకు కారణం చిరంజీవి గారే’. ‘నిన్న జరిగిన గొడవ యూనియన్ కి సంబంధించినది. మళ్లీ మళ్లీ చెప్తున్నాను , మా డ్యాన్స్ మాస్టర్స్ మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. చిన్న చిన్న విషయాల్లో అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వస్తుంటాయి అంతే’ అంటూ చెప్పుకొచ్చారు.
అనంతరం జానీ మాస్టర్ సతీమణి సుమలత మాట్లాడుతూ ‘అస్సోసియేషన్ లో కొన్నేళ్ల నుండి కొన్ని తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒక ప్రెసిడెంట్ గా నేను వాటి అన్నిటికి బాధ్యత తీసుకొని ఇంత దూరం నడిపించడం చిన్న విషయం కాదు. ఏ చిన్న తప్పు జరిగినా నన్నే తప్పుబడుతారు. అలాంటి జరగకూడదు అనే నేను ప్రతీ దాన్ని ప్రశ్నిస్తాను.
ముఖ్యంగా కొందరి డ్యాన్సర్ల దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు. నిర్మాతల దగ్గర ఒక అమౌంట్ తీసుకొని , అస్సోసియేషన్ లో తక్కువ ఇస్తున్నారు. ఒకవేళ ఇదేంటి అని ప్రశ్నిస్తే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా చేసిన వారిని సస్పెండ్ చేశాను ‘ అంటూ చెప్పుకొచ్చింది సుమలత.




