Andhra PradeshPoliticalTelangana

జాగింగ్ చేస్తుండగా వాహనం ఢీకొని.. హెడ్‌కానిస్టేబుల్ మృతి

జాగింగ్ చేస్తుండగా వాహనం ఢీకొని.. హెడ్‌కానిస్టేబుల్ మృతి

జాగింగ్ చేస్తుండగా వాహనం ఢీకొని.. హెడ్‌కానిస్టేబుల్ మృతి

ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున జాగింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. ఏపీఎస్పీ రెండో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి తెల్లవారుజామున బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న జాతీయ రహదారిపై జాగింగ్ చేస్తున్నారు.

ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వాహనం వరప్రసాద్ రెడ్డిని ఢీకొట్టింది. దీంతో ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడిన ఆయన తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button