
ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి బలవన్మరణం
Web desc : ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక ఓ యువతి తనువు చాలించింది. ఈ విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన వెంకటేష్ అనే సింగరేణి ఉద్యోగి ప్రేమ పేరుతో మాధవి అనే యువతిని వేధించడంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
కాగా, వెంకటేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దవాఖాన ఎదుట మాధవి బంధువులు ఆందోళన చేపట్టారు.




