
ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికపై అధికార పార్టీలో అప్పుడే కసరత్తు మొదలైంది.
హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అభ్యర్థుల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలుసుకోవాలని నిర్ణయించారు.
ఈ ఎన్నికల్లో సమర్థుడైన అభ్యర్థిని బరిలో దింపాలనే అంశంపై నాయకుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అందరి అభిప్రాయాలను సేకరించి హైకమాండ్‌కు నివేదిక అందజేయనున్నారు. అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేయించుకోవాలని మంత్రి పొన్నం సూచించారు.




