KhammamPoliticalTelangana

ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత కట్ట మృతి…

ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత కట్ట మృతి…

ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత కట్ట మృతి…

జన సంద్రోహా నడుమ కట్ట అంతిమయాత్ర…

పాడి మోసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ…

మందకృష్ణ రాకతో దద్దరిల్లిన ప్రొద్దుటూరు…

సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.

మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత ,ప్రముఖ ఆర్ఎంపి వైద్యులు కట్ట వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి గుండె పోటుతో మృతి చెందారు కట్ట వెంకటేశ్వర్లు ఆర్ఎంపి వైద్యులుగా, ఎమ్మార్పీఎస్ ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత గా పేదలకు తన వైద్య సేవలను అందిస్తూ పేదల వైద్యుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు వైద్యంతోపాటు వైద్యంతోపాటు అలాగే సామాజిక స్పృహతో ఎంఆర్పిఎస్ చేస్తున్న ఉద్యమాలకు ఆకర్షితుడై పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అడుగుజాడల్లో మొదటి నుంచి నడుస్తూ ఎమ్మార్పీఎస్ 30 ఏళ్ల ఉద్యమానికి ఆర్థికంగా మండల కమిటీకి సహాయ సహకారాలు అందిస్తూ తన వంతు కృషి చేశారు తన వయసు రిత్యా అనారోగ్య పాలు కావడం, ఉద్యమానికి తన అకాల మరణం తీరని లోటు గా మిగిలింది కట్ట వెంకటేశ్వర్లు మరణ వార్త తెలుసుకున్న మందకృష్ణ మాదిగ హుటా హుటిన హైదరాబాదు నుంచి తన ముఖ్యమైన కార్యక్రమాలను సైతం రద్దు చేసుకొని కట్టా వెంకటేశ్వర్ల అంతిమయాత్రలో పాల్గొన్నారు స్వయంగా కట్ట వెంకటేశ్వర్ల అంతిమయాత్ర ముగింపు వరకు స్వయంగా పాడే మోసి, భూస్థాపితం ముగిసే వరకు అక్కడే ఉండి తన ప్రగాఢ సానుభూతిని అభిమానాన్ని చాటుకున్నారుఅలాగే కృష్ణ మాదిగ రాకతో ప్రొద్దుటూరు చుట్టుపక్కల గ్రామల ప్రజలు సైతం పాల్గొనడంతో ప్రొద్దుటూరు గ్రామం జనసంద్రంగా మారింది

ఈ సందర్భంగా కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఇంతకాలం నా సహచరుడిగా ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి సహకరిస్తూ వచ్చిన కట్ట వెంకటేశ్వర్లు కుటుంబానికి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇటువంటి సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందన్నారు అనంతరం ఇటీవలే ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన తుడుం స్వామి చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఇద్దరు కుమారులకు మెరుగైనటువంటి విద్యను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శ్రేణులకు ఆదేశించారు

ఈ కార్యక్రమంలో వార్తాపత్రిక సీనియర్ జర్నలిస్టు గార్లపాటి రమేష్ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయిలో గల నాయకులు, కుటుంబ సభ్యులు, సానుభూతిపరులు శ్రేయోభిలాషులు వివిధ గ్రామాలకు చెందిన గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button