KamareddyPoliticalTelangana

ఫైన్ డబ్బులు కట్టాలని ఒత్తిడి.. భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

ఫైన్ డబ్బులు కట్టాలని ఒత్తిడి.. భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

ఫైన్ డబ్బులు కట్టాలని ఒత్తిడి.. భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

Web desc : బాధిత కుటుంబానికి డబ్బులు చెల్లించాల్సి ఉండడం, రాసిచ్చిన కాగితం ప్రకారం ఆ డబ్బులు చెల్లించే పరిస్థితి ప్రస్తుతానికి లేకపోవడం, డబ్బులు చెల్లించాలన్న ఒత్తిడి పెరిగిపోవడంతో చేసేదేమీ లేక భార్యాభర్తలు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో శనివారం తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే బస్వాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు గ్రామస్తులు గత రెండు నెలల క్రితం మెదక్ జిల్లా రామాయంపేట నుంచి ప్యాసింజర్ ఆటోలో ఎక్కి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదవశాత్తు, ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదానికి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని గుర్తించి, మృతుని కుటుంబానికి 6 లక్షల రూపాయల ఫైన్ చెల్లించాలని గ్రామస్తులంతా కలిసి డిసైడ్ చేశారు. అందుకోసం బాండ్ పేపర్ కూడా రాసుకున్నారు.

ఆటో యజమాని తరపున, మృతుని కుటుంబానికి అడ్వాన్స్ గా అదే రోజు లక్ష రూపాయలు ఇవ్వగా, మిగతా ఐదు లక్షల రూపాయలకు గాను, రెండు వాయిదాలలో చెల్లించాలని కండిషన్ రాసుకున్నారు. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించాలని బాధిత మృతుని కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడం, డబ్బులు చెల్లించే స్తోమత ప్రస్తుతానికి లేకపోవడంతో చేసేదేమీ లేక శ్రీనివాస్ గౌడ్ శ్రీలత భార్యాభర్తలు ఇద్దరూ ఇంట్లో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు భార్యాభర్తలిద్దరిని వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని భావించి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి కు రిఫర్ చేశారు.

ఎలుకల మందు డోసు ఎక్కువగా తీసుకోవడం వలన భర్త కోమాలోకి వెళ్ళగా, వైద్యం అందిన తర్వాత భార్య లత ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రస్తుతం మాట్లాడుతుందని, బంధువులు ఓ పత్రిక విలేకరితో మాట్లాడుతూ వివరించారు. సూసైడ్ అటెంప్ట్ తో చనిపోతామని భావించి జిల్లా ఎస్పీ పేరిట ఒక సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకోగా, ఆ చీటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button