KhammamPoliticalTelangana

చెట్టు పడిన వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు

చెట్టు పడిన వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు

చెట్టు పడిన వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు

తక్షణమే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ ఏన్కూరు సెప్టెంబర్‌ 25 2026: మండల పరిధిలోని గార్లఒడ్డు గ్రామంలో విద్యుత్‌ లైన్‌పై చెట్టు పడిన ఘటనపై విద్యుత్‌ అధికారులు వెంటనే స్పందించారు. సమాచారం అందిన వెంటనే ఏఈ ఉమాకాంత్‌ ఆదేశాలతో లైన్‌మెన్‌ శ్రీను, సురేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

విద్యుత్‌ లైన్‌కు అంతరాయం ఏర్పడిన విషయాన్ని గుర్తించిన సిబ్బంది, ప్రమాదానికి అవకాశం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టారు. అనంతరం తక్షణమే మరమ్మతు పనులు ప్రారంభించి, దెబ్బతిన్న విద్యుత్‌ లైన్‌ను సరిచేశారు. దీంతో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

చెట్టు పడిన విషయం తెలిసిన వెంటనే స్పందించి సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపడంతో పాటు, మరమ్మతులు వేగంగా పూర్తిచేయడంపై గ్రామస్థులు విద్యుత్‌ అధికారులను అభినందించారు. విద్యుత్‌ అంతరాయం ఏర్పడిన సమయంలో సకాలంలో స్పందించి సేవలు అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button