JagityalaNotificationPoliticalTelangana

మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇంటర్‌ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు! ఎలాంటి రాత పరీక్ష లేదు

మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇంటర్‌ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు! ఎలాంటి రాత పరీక్ష లేదు

మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇంటర్‌ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు! ఎలాంటి రాత పరీక్ష లేదు

జగిత్యాల జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 21, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ కాగా.. తాజాగా జగిత్యాల జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. జిల్లాలోని ధర్మపురి, జగిత్యాల, మల్యాల, మెట్‌పల్లి ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 64 పోస్టులు ఉన్నాయి.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..

ధర్మపురిలో పోస్టుల సంఖ్య: 16
జగిత్యాలలో పోస్టుల సంఖ్య: 22
మల్యాలలో పోస్టుల సంఖ్య: 12
మెట్‌పల్లిలో పోస్టుల సంఖ్య: 14

అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం స్థానిక మహిళా అభ్యర్థులు అర్హులు.

దివ్యాంగ మహిళా అభ్యర్థులు కూడా నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వినికిడి, దృష్టి, అంగవైకల్యం ఉన్నప్పటికీ విధులు నిర్వర్తించే సామర్థ్యం, పిల్లలకు ప్రాథమిక విద్యాబోధన, సంరక్షణ చేయగల సామర్థ్యం ఉండాల.అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి స్థానిక మహిళ అయి ఉండటం తప్పనిసరి. పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డులో నివసిస్తున్న మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో నివసించే మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం ఇలా.. ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్ట్ 21, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల ఎంపికను జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (DSC) చేపడుతుంది. అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి 10 మార్కులు కేటాయిస్తారు. ఎంపికలో వివిధ అంశాలకు వెయిటేజీ ఉంటుంది.

ఇంటర్మీడియట్‌లో సాధించిన మార్కులకు 70 శాతం, అనాథలు, వితంతువులకు 5 శాతం, అనాథ శరణాలయ అభ్యర్థులకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ కేటాయించారు. ఇంటర్వ్యూకు 10 మార్కులు ఉంటాయి. అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. దరఖాస్తు చేసే ముందు స్థానికత, విద్యార్హత, వయోపరిమితి, వెయిటేజీ, అవసరమైన ధ్రువపత్రాలకు సంబంధించిన నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తిగా పరిశీలించాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button