
కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్.. కీలక నేతపై పోక్సో కేసు.. అసలేం జరిగిందంటే..?..
web desc : తెలంగాణలో ఇటీవల మైనర్ బాలికలపై వేధింపులు, అత్యాచార ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కామాంధులు మాత్రం మారడంలేదు.
ఈ నేపథ్యంలో ఇటీవల కొత్త పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత తెలంగాణ వ్యాప్తంగా కెడర్ బలోపేతంకు పాటుపడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నికల్లో ఇచ్చిన హమీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ పై సైతం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఖమ్మంజిల్లాకు చెందిన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన నాయకుడిపై పోక్సో కేసు నమోదు కావడం స్థానికంగా సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లా వైరాలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల బాలికపై తెలంగాణ రక్షణ సేన ఇన్చార్జ్ గౌరవరపు డేవిడ్ రాజ్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది.
లెక్కలు చెబుతానని ఇంట్లోకి చొరబడి ఆరో తరగతి బాలికపై డేవిడ్ రాజ్ అత్యాచారంకు పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేరు. మరల ఇంటికి వచ్చి చూడగా బాలిక జరిగిన దారుణంను బైటపెట్టింది.
ఈ క్రమంలో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కాస్త కొత్తగా పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవితకు ఊహించని షాక్ అని స్థానిక నాయకులు చెబుతున్నారు. దీనిపై కవిత ఏ విధంగా రియాక్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది.




