
గుండెపోటుతో సర్పంచ్ కన్నుమూత
మహబూబాబాద్ కొత్తగూడ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
సికె న్యూస్ మహబూబాబాద్ జిల్లా (పతినిధి:దుర్గం మురళి ఆగష్టు 22
ఓటాయి గ్రామపంచాయతీ సర్పంచ్ గట్టి రాములు అర్ధరాత్రి హఠాన్మరణం చెందారు.సమాచారం ప్రకారం, శనివారం తెల్లవారిజామున సుమారు రాత్రి 1 గంటల సమయంలో ఆయనకు అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి చికిత్స అందించేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే రాములు అకాల మరణంతో ఓటాయి గ్రామంలో శోకఛాయలు అలముకున్నాయి.




