
భర్త వేధింపులు తాళలేక మహిళా పోలీస్ బలవన్మరణం..
web desc : మహారాష్ట్రకు చెందిన 31 ఏళ్ల మహిళా పోలీస్ అధికారిణి, భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహం తర్వాత ఈమె తన భర్తతో కలిసి డోంబివిలి వెస్ట్ ప్రాంతంలో నివాసం ఉంటోంది.
పోలీస్ శాఖలో పనిచేస్తున్నప్పటికీ, ఆమె భర్త ‘నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అంటూ చులకనగా మాట్లాడటమే కాకుండా.. కులం పేరుతో దూషిస్తూ శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేసేవాడు.
అంతేకాకుండా, భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని తరచూ గొడవపడుతూ ఆమెపై దాడికి దిగేవాడు. ఇంటి ఖర్చులు, నిత్యావసర వస్తువుల కొనుగోలు విషయంలోనూ వీరిద్దరి మధ్య రోజూ తీవ్ర వాగ్వాదం జరిగేది. భర్త నిరంతరం పెడుతున్న మానసిక క్షోభ, శారీరక వేధింపుల వల్లే ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకుందని మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విష్ణునగర్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతి చెందిన మహిళా అధికారిణి భర్తను అరెస్ట్ చేశారు. అలాగే, ఈ వేధింపులకు కారణమైన అత్తమామల కుటుంబంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.




