EducationNationalNotificationPolitical

పోస్టాఫీస్‌లో 23,757 ఉద్యోగాలు.. నేటి నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ!

పోస్టాఫీస్‌లో 23,757 ఉద్యోగాలు.. నేటి నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ!

పోస్టాఫీస్‌లో 23,757 ఉద్యోగాలు.. నేటి నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ!

పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం. పోస్టల్ శాఖ మొత్తం 23,757 గ్రామీణ బ్యాంక్ పోస్టుల భర్తీకి నోటీసు ఇచ్చింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ 2026 ఆగస్టు 31 నుండి ప్రారంభమైంది.

సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి అప్లికేషన్‌ దరఖస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం టెన్త్ క్లాస్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ పోస్టులను భర్తీ చేయనున్న ఈ ప్రక్రియ సెప్టెంబర్ 19 వరకు కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అర్హతలను పరిశీలించి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియా పోస్ట్ GDS 2026 ముఖ్యమైన తేదీలు..
వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఆగస్టు 31 నుండి మొదలైంది. రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 19 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

దరఖాస్తులు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు. ఫీజు చెల్లించడానికి, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 21. అప్లికేషన్ కరెక్షన్ విండో సెప్టెంబర్ 23 నుండి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదివి, గడువులోపు దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించాలి. ఇండియా పోస్ట్ సర్కిల్ వైస్ ఖాళీల వివరాలు..
దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో మొత్తం 23,757 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 917, అస్సాంలో 414, బీహార్‌లో 1098, ఛత్తీస్‌గఢ్‌లో 762, ఢిల్లీలో 16, గుజరాత్‌లో 499, హర్యానాలో 87, హిమాచల్ ప్రదేశ్‌లో 335, జమ్మూ కాశ్మీర్‌లో 340, ఝార్ఖండ్‌లో 1379, కర్ణాటకలో 1116, కేరళలో 1373, మధ్యప్రదేశ్‌లో 1450, మహారాష్ట్రలో 2431, నార్త్ ఈస్టర్‌లో 2014, ఒడిశాలో 1353, పంజాబ్‌లో 122, రాజస్థాన్‌లో 1009, తమిళనాడులో 2018, తెలంగాణలో 419, ఉత్తరాఖండ్‌లో 452, ఉత్తరప్రదేశ్ లో 1691, వెస్ట్ బెంగాల్‌లో 1762 పోస్టులు ఉన్నాయి.

అత్యధికంగా నార్త్ ఈస్ట్, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ సర్కిల్స్‌లో ఖాళీలు ఉన్నాయి. అతి తక్కువగా ఢిల్లీలో ఖాళీలు ఉన్నాయి.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ https://indiapost.gov.in/gdsonlineengagement ను సందర్శించి, నోటిఫికేషన్ పిడిఎఫ్ చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button