HyderabadPoliticalTelangana

లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడిన ఎస్ఐ

లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడిన ఎస్ఐ

లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడిన ఎస్ఐ

Web desc : కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు టోలిచౌకి ఎస్సైని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టోలిచౌకి పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఆర్. పాండు నాయక్‌కు ఓ మహిళ తన కుమారుడు వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.

ఈ కేసులో మహిళ కుమారుడిని పిలిపించిన ఎస్సై పాండు నాయక్ కేసు నమోదు చేస్తానని, పాస్‌పోర్టు సీజ్ చేస్తానని బెదిరించాడు. తనకు పదివేలు ఇస్తే కేసు నమోదు చేయనని ఎస్సై చెప్పడంతో అంగీకరించిన బాధితుడు, ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు.

వారి సూచనల మేరకు మంగళవారం పోలీస్ స్టేషన్‌లో రూ. 10,000 ఇస్తుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు, తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఎస్సైని చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button