
ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం చేశాడని యువతి ఫిర్యాదు…
web desc : పెళ్లి చేసుకుంటానని నమ్మించి 11 ఏళ్ల పాటు ప్రేమ పేరుతో తనతో సంబంధం కొనసాగించి, రెండు సార్లు గర్భం దాల్చిన సమయంలో అబార్షన్ చేయించాడని ఆరోపిస్తూ ఓ యువతి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. బాధితురాలు 2013-15లో ఎంటెక్ చదువుతున్న సమయంలో శెట్టి అరుణ్ కుమార్ (34) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పట్లో ఆయన లకిడీకాపూల్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 2014లో ప్రేమ పేరుతో తనకు దగ్గరై, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించింది.
2025, 2026లో తాను గర్భం దాల్చగా తన ఇష్టానికి విరుద్ధంగా అబార్షన్ మాత్రలు ఇచ్చి గర్భస్రావం చేయించాడని పేర్కొంది. తన కులం కారణంగా అరుణ్ కుటుంబం పెళ్లికి అంగీకరించడం లేదని చెబుతూ వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చాడని తెలిపింది. ఇటీవల పెళ్లి కోసం రూ.50 వేల అడ్వాన్స్‌గా చెల్లించామని బాధితురాలు పేర్కొంది.
అయితే అరుణ్ ఇప్పటికే దివ్య పుష్ప అనే మహిళను 2026 జూలై 1న నాగోల్‌లోని అమరావతి బాంక్వెట్ హాల్లో వివాహం చేసుకున్నట్లు తనకు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. 11 ఏళ్లుగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, చివరకు మరో మహిళను వివాహం చేసుకున్న అరుణ్ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఉప్పల్ పోలీసులను కోరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




