PoliticalTelanganaYadadri

పేదల వైద్యానికి ఎమ్మెల్యే అండ...

పేదల వైద్యానికి ఎమ్మెల్యే అండ...

పేదల వైద్యానికి ఎమ్మెల్యే అండ…

సికే న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధి బాలరాజు సెప్టెంబర్ 2.
యాదాద్రి భువనగిరి జిల్లా
వలిగొండ: పేదల వైద్యానికి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అండగా నిలుస్తున్నారని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, సర్పంచ్ రేసు బుచ్చిరెడ్డి అన్నారు.

మండలంలోని గ్రామానికి చెందిన పల్లపు వెంకటేశం కుమారుడు పనిత్‌కుమార్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ చెక్కును ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా వెంకటేశం సోదరుడు ఉపేందర్‌కు అందజేశారు.

గత ఎనిమిది నెలల క్రితం కూడా వైద్య ఖర్చుల కోసం రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కును అందించినట్లు తెలిపారు. పేదల వైద్యం కోసం తాను కోరిన వెంటనే స్పందించి ఎల్‌ఓసీ చెక్కులు మంజూరు చేస్తున్న ఎమ్మెల్యేకు రేసు బుచ్చిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బత్తిని సాదేవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్యా నాయక్, సింగిల్ విండో చైర్మన్ గారిసె రవి, మత్స్యగిరిగుట్ట చైర్మన్ తుమ్మల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ పద్మ అనంతరెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ జక్కజంగ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, మాజీ ఎంపీపీ నూతి రమేష్‌రాజు, చెరుకు శివయ్య, దుబ్బ దానయ్య, చలిగంజి పృద్వి, చలిగంజి వీరస్వామి, బద్దం సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జానకిరామ్, మాజీ సర్పంచ్ మల్లేశం, కంచనపల్లి మాజీ ఉపసర్పంచ్ జక్క రాజేందర్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button