
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిరుపేదలకు ఇండ్లు
- పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం
- జనగాంలో లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్
- నూతన ఇళ్లలో గృహప్రవేశంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం
- అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి
సికే న్యూస్ పెద్దేముల్ ప్రతినిధి , సెప్టెంబర్ 7
నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ అన్నారు. సోమవారం పెద్దేముల్ మండల పరిధిలోని జనగాం గ్రామంలో బోయిని పకీరమ్మ–రాములు, నారబోయిని సుజాత–రవీందర్, వడ్డే శిరీష–యాదయ్య దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో ఆయన పాల్గొని,లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ.. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఒక కల, ఆ కలను నిజం చేయడం ప్రభుత్వ బాధ్యతగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నూతనంగా నిర్మించిన ఇళ్లలో లబ్దిదారుల కుటుంబాలు గృహప్రవేశం చేయడం ఆనందంగా ఉందన్నారు.
సొంతింటిలోకి అడుగుపెడుతున్న లబ్ధిదారుల కుటుంబాల్లో సంతోషం చూడటం ఎంతో సంతృప్తినిస్తోందని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జనగాం గ్రామ సర్పంచ్ సంజామొళ్ల అరుణ,పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.మహిపాల్ రెడ్డి, తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ-బ్లాక్ అధ్యక్షులు లొంక నర్సింహులు, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ మహేష్,వార్డు సభ్యులు చెక్క నర్సింహులు, మల్లేశం,నాయకులు మధుసూదన్ రెడ్డి, శివకుమార్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.




