PoliticalRangareddyTelangana

పూజలు లేకుండానే నేరుగా గంగమ్మ ఒడికి గణేశుడు

పూజలు లేకుండానే నేరుగా గంగమ్మ ఒడికి గణేశుడు

పూజలు లేకుండానే నేరుగా గంగమ్మ ఒడికి గణేశుడు

నవరాత్రులు లేకుండానే చేసిన వైనం

పీర్జాపూర్ లో ఘటన

గ్రామంలో ఇరువర్గాల మధ్య పట్టు

ఆలయంలో గణేష్ ప్రతిష్ట జరగకుండా వివాదం

గణేష్ ప్రతిష్టను అడ్డుకున్న వివాదం – పోలీసుల రంగ ప్రవేశం

షాద్ నగర్ నియోజక వర్గంలో ఘటనపై భక్తుల అసంతృప్తి

షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు సి కె న్యూస్ ప్రతినిధి సెప్టెంబర్ 14

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని బీర్జాపూర్ గ్రామంలో గణేష్ నవరాత్రులు కలిసికట్టుగా ఐకమత్యంతో జరుపుకునే సామూహిక వేడుక.. అలాంటి పండుగలను గ్రామాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిన గ్రామ పెద్దలు మరి కొందరు గ్రూపులుగా విడిపోయి చివరకు గ్రామానికి తెచ్చిన గణేశుడిని ప్రతిష్ట చేయకుండా ఎలాంటి పూజలు నిర్వహించకుండా వివాదాల మధ్య గంగమ్మ గుడికి చేరుకుంది. ఈ సంఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగుడా మండలం పీర్జాపూర్ గ్రామంలో గల ఆంజనేయస్వామి దేవాలయంలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు చేయాలని కొందరు గ్రామస్తులు భావించారు.

అయితే మరో వర్గం వారు ఇది ఒప్పుకోకుండా తాము ఏర్పాటు చేసిన గణేశుడే ఉండాలన్న పట్టుదలతో ఇరువర్గాల మధ్య వివాదం రేగింది. గ్రామంలో జరుగుతున్న ఈ వివాదం ఘర్షణలకు తావివ్వకుండా చౌదరిగుడా పోలీసులు సైతం రంగ ప్రవేశం చేశారు. ఆలయంలో ఎవరు గణేష్ విగ్రహాన్ని పెట్టకుండా వేరేచోట పెట్టుకోవాలని ఆదేశించారు. దీంతో మరో వర్గం చేసేది లేక తీవ్ర అసంతృప్తితో గణేశుడిని గ్రామ చెరువులో కాసేపటి క్రితం నిమజ్జనం చేశారు.

అసలేం జరిగిందంటే..?

పీర్జాపూర్ గ్రామానికి చెందిన శ్రీరాములు తిరుపతి సంగమేష్ కురువ మల్లయ్య కురువరాముడు రమేష్ బందయ్య సాకలి అంజయ్య నలగంటి దశరథం బోనంపాటి చెన్నయ్య తదితరులు గ్రామ ఆంజనేయ స్వామి దేవాలయంలో వినాయక ఉత్సవాలను నిర్వహించేందుకు కొంతమంది గ్రామస్తులు సహకారంతో విగ్రహాన్ని తీసుకువచ్చారు. వినాయక చవితి రోజున సదరు విగ్రహాన్ని గ్రామ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్టించేందుకు నవరాత్రులు జరిపేందుకు ముందుకు వచ్చారు.

అయితే గ్రామ సర్పంచ్ ఎర్రగుమ్ము నర్సింలు, అదేవిధంగా తుమ్మకింది మల్లేష్ కొండయ్యల, కొండయ్యల రమేష్, కొండయ్యల కృష్ణయ్య, సాలె యాదయ్య, కొండయ్యల బుచ్చయ్య, సాలె రవి, అభవతి శేఖర్, బాలయాల నరసింహులు తదితరులు ఆంజనేయస్వామి దేవాలయంలో విగ్రహాన్ని పెట్టేది లేదని బయట ఎక్కడైనా పెట్టుకోవాలని సూచించడంతో వివాదం చెలరేగిందని పీర్జాపూర్ గ్రామానికి చెందిన శ్రీరాములు తిరుపతి సంగమేష్ తెలిపారు.

పోలీసుల రంగ ప్రవేశం.. గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ నవరాత్రులు జరపడానికి రెండు వర్గాలు వివాదానికి దిగుతున్నాయన్న సమాచారం అందుకొని పోలీసులు గ్రామంలో రంగ ప్రవేశం చేశారు. గ్రామంలో పండుగ వేళ ఎలాంటి వివాదాలు ఘర్షణలు చేయకుండా ఆలయంలో ఏ వర్గం విగ్రహాన్ని పెట్టకుండా ఇతర చోట్లలో పెట్టుకోవాలని ఆదేశించారు.

పోలీసుల ఆదేశాలు శిరసా వహించిన గ్రామస్తులు సర్పంచ్ వర్గం గ్రామంలో పోచోట వినాయకుడిని ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహించుకోగా తీవ్ర అసంతృప్తికి గురైన మరో వర్గం వినాయకుడిని నేరుగా గంగమ్మ గుడి కి తీసుకువెళ్లారు. వినాయకుడిని ఎలాంటి పూజలు నిర్వహించకుండా నవరాత్రులు జరపకుండా గ్రామ చెరువులో నిమజ్జనం చేయడం గమనార్హం.

ఈ వ్యవహారంపై శ్రీరాములు మీడియాతో మాట్లాడుతూ దేవుడు వద్దు ఈ కథ వద్దు.ఇంత పట్టు పట్టి ఆలయంలో గణేశుడిని పెట్టకుండా సర్పంచ్ సహకారంతో కొందరు నాటకాలు ఆడారని ఇది మంచి పద్ధతి కాదని, ఎన్నికల్లో అందర్నీ కలుపుకున్నట్లు నటించి ఇప్పుడు అప్పుడు ఇలా చేశారని వాపోయారు. ఏదైనా ఆ దేవుడు చూసుకుంటాడు అని ఆవేదన వ్యక్తం చేశారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button