JagityalaManchiryalaNizamabadPoliticalTelangana

భర్త పట్టించుకోవడం లేదని.. ప్రియుడి చెంతకు వెళ్లిన భార్య

భర్త పట్టించుకోవడం లేదని.. ప్రియుడి చెంతకు వెళ్లిన భార్య

భర్త పట్టించుకోవడం లేదని.. ప్రియుడి చెంతకు వెళ్లిన భార్య

Web desc : భర్త సరిగా చూసుకోవడం లేదని ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ మరో వ్యక్తితో ప్రేమలో పడింది. భర్తకు విడాకులు ఇప్పించిన అతడు నాలుగేళ్లు ఆమెతో సహజీనం చేశాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. ఆడపిల్ల అని తెలిసి అబా ర్షన్‌ చేయించాడు.

తీరా పెళ్లికి నిరాకరించడంతో అటు భర్త, కన్నవారికి దూరమై.. ఇద్దరు పిల్లలతో ఎలా జీవించాలో తెలియక ఈ నెల 13న ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.

బాధితురాలి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళకు నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పెల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తితో వివాహామైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

అతడు విదేశానికి వెళ్లేవాడు. ఇద్దరి మధ్య గొడవల కారణంగా విడిపోయారు. ఈ క్రమంలో బాధిత వివాహిత స్నేహితురాలి స్నేహితుడు మందమర్రికి చెందిన మహేష్‌తో కలిసి మందమర్రి పాలచెట్టు ప్రాంతానికి చెందిన షారుఖ్‌పాష పరిచయమయ్యాడు. ఈ ముగ్గురు కలిసి తరచూ బాధిత మహిళ ఇంటికి వచ్చి వెళ్లేవారు.

ఈ క్రమంలో షారుఖ్‌పాషకు బాధిత మహిళతో సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో ఆమెతో భర్తకు కోర్టు ద్వారా విడాకులు ఇప్పించాడు. ఆడపిల్ల అని తెలిసి అబార్షన్‌!
సదరు వివాహితను పెళ్లి చేసుకుంటానని, ఇద్దరు కూతుళ్లను చూసుకుంటానని షారుఖ్‌పాష నమ్మించి రామకృష్ణాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని క్యాతనపల్లిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొంతకాలం సహజీవనం చేశారు.

ఈ విషయం అతడి తల్లిదండ్రులకు కూడా తెలియడంతో నాలుగేళ్లుగా కలిసే ఉంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆమెకు అబార్షన్‌ చేయించగా.. మూడోసారి మంచిర్యాల బస్టాండ్‌ సమీపంలోని ఓ స్కానింగ్‌ సెంటర్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాడు.

ఆడపిల్ల అని తేలడంతో మళ్లీ అబార్షన్‌ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరు పెద్ద మనుషులను పిలిపించి షారుఖ్‌పాషపై ఆమె ఒత్తిడి తేగా నిరాకరించాడు. దీంతో ఆ మహిళ దోమలమందు, జ్వరం గోలీలు వేసుకుని ఈ నెల 13న ఆత్మహత్యాయత్నం చేసింది.

స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఈ విషయమై సీఐ ప్రమోద్‌రావు స్పందిస్తూ బాధితురాలి ఫిర్యాదు మేరకు షారుఖ్‌పాషపై కేసు నమోదు చేసి రామకృష్ణాపూర్‌ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button