Mahabub badPoliticalTelangana

ఎమ్మెల్యే కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..! డ్రైవర్ కి గాయాలు

ఎమ్మెల్యే కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..! డ్రైవర్ కి గాయాలు

ఎమ్మెల్యే కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..! డ్రైవర్ కి గాయాలు

Web desc : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది.ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖలకు చెందిన అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. దీనిలో భాగంగా.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ మహబూబాబాద్ కలెక్టరేట్‌కు బయలుదేరారు.

ఇంతలో కారు చింతపల్లి వద్దకు రాగానే పొగలు రావడం మొదలైంది. ఏంటని చూడగా కారులో ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతోపాటు, కేబిన్‌లో మంటలు వేగంగా వ్యాపించాయి. వెంటనే చుట్టుపక్కల సిబ్బంది అప్రమత్తమయ్యారు.

కారు నుంచి ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రు నాయక్‌ ను దింపారు. అప్పటికే ఆయనకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తొంది. ఈ ఘటనలో డ్రైవర్‌ సైతం స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే మరో కారు రప్పించడంతో ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ ను మహబూబాబాద్ కలెక్టరేట్‌కు తరలించారు.

ఈ క్రమంలో తమ నేత ప్రయాణిస్తున్న కారులో అగ్ని ప్రమాదం చోటు చేసేుకుందని తెలియడంతో అభిమానులు ఒకింత టెన్షన్ కు గురయ్యారు. ఆయన సురక్షితంగా ఉన్నారని విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button