KhammamPoliticalTelangana

టిజేజేఏసీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా గుగులోత్ భావుసింగ్ నాయక్

టిజేజేఏసీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా గుగులోత్ భావుసింగ్ నాయక్

టిజేజేఏసీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏకగ్రీవంగా నియామకం.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ సెప్టెంబర్‌ 21 2026 : తెలంగాణ జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ (TJJAC) ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా గార్లఒడ్డుకు చెందిన గుగులోత్ భావుసింగ్ నాయక్ నియమితులయ్యారు. ఆయనను TJJAC రాష్ట్ర అధ్యక్షుడు తొంగరి కరుణాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.

ఈ సందర్భంగా గుగులోత్ భావుసింగ్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.

జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. తనపై రాష్ట్ర కమిటీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ TJJACను జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని గుగులోత్ భావుసింగ్ నాయక్ పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button