HyderabadPoliticalTelangana

టీచర్‌పై ప్రిన్సిపాల్ వేధింపులు.. నిలదీసిన సోదరుడిపై కత్తితో దా*డి

టీచర్‌పై ప్రిన్సిపాల్ వేధింపులు.. నిలదీసిన సోదరుడిపై కత్తితో దా*డి

టీచర్‌పై ప్రిన్సిపాల్ వేధింపులు.. నిలదీసిన సోదరుడిపై కత్తితో దా*డి

కుత్బుల్లాపూర్: : పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ పై అదే పాఠశాల ప్రిన్సిపాల్ వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ప్రశ్నించడానికి వెళ్లిన సోదరుడిపై దాడి చేసిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం…పాండు బస్తీలో ఉన్న ఏవీ మోడల్ హైస్కూల్‌లో తన చెల్లెలు గత ఐదారు నెలలుగా ఏవీ మోడల్ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది.

అయితే, ఉద్యోగంలో చేరినప్పటి నుంచే ప్రిన్సిపాల్ ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అసభ్యకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఆదివారాల్లో కూడా పాఠశాలకు ఒంటరిగా రావాలంటూ వేధించేవాడు. ఒక సందర్భంలో తరగతి గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె పట్ల చనువు ప్రదర్శించే ప్రయత్నం చేయగా, ఆమె తీవ్రంగా నిరాకరించింది.

దీంతో కక్ష పెంచుకున్న ప్రిన్సిపాల్.. ఆమెపై పనిభారం పెంచడం, సాయంత్రం 6:30 గంటల వరకు పాఠశాలలోనే ఉండాలని ఒత్తిడి చేయడం, ఇతర ఉపాధ్యాయుల ఎదుట కించపరిచేలా మాట్లాడడం వంటి చర్యలకు దిగాడు. ప్రిన్సిపాల్ మానసిక వేధింపులు భరించలేక సదరు టీచర్ తీవ్ర మనస్తాపంతో కొన్ని రోజులుగా పాఠశాలకు వెళ్లడం మానేసింది.

విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు, ప్రిన్సిపాల్‌ను కలిసి శాంతియుతంగా నిలదీసేందుకు పాఠశాలకు వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన ప్రిన్సిపాల్ , అకస్మాత్తుగా కత్తితో బాధితుడిపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై తన దుస్తులు తడిసిపోయాయని పేర్కొంటూ, రక్తపు మరకలతో ఉన్న బట్టలను మీడియా ఎదుట ప్రదర్శించాడు.

పాఠశాల ఆవరణలోనే జరిగిన ఈ ఘటన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయని బాధితుడు తెలిపాడు. మహిళా టీచర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, ప్రశ్నించిన వారిపై హత్యాయత్నానికి ఒడిగట్టిన సదరు ప్రిన్సిపాల్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పాఠశాలను తక్షణమే మూసివేయాలని బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button