EducationHealthPoliticalTelanganaWarangal

బాలికలను చితకబాదిన టీచర్‌...

బాలికలను చితకబాదిన టీచర్‌...

బాలికలను చితకబాదిన టీచర్‌…

Web desc : క్రమశిక్షణ పేరుతో టీచర్‌ బాలికలను విచక్షణా రహితంగా చితకబాదిన ఘటన వరంగల్‌ జిల్లా నెక్కొండలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థునులు, వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బాలికల టీజీ గురుకుల పాఠశాల/కళాశాలలో ఈ నెల 4న రాత్రి స్టడీ అవర్‌లో ఇంగ్లిష్‌ టీచర్‌ రజినీ ఐదో తరగతి విద్యార్థులపై దుడ్డు కర్రతో దాడి చేసింది. 35 మంది బాలికల చేతులు వాచేలా, వేళ్లు పగిలేలా దండించింది.

ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని వారిని బెదిరించింది. మంగళవారం ఉదయం పలువురు విద్యార్థునులు వారి తల్లిదండ్రులకు ఏడుస్తూ విషయాన్ని చెప్పడంతో వారు గురుకులానికి వచ్చి ప్రిన్సిపాల్‌ శ్రీదేవి, టీచర్‌ రజినీని నిలదీశారు. వారిద్దరూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రిన్సిపాల్‌ సైతం సదరు టీచర్‌ పక్షాన మాట్లాడటం పట్ల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు.

విచారణ చేసి రజినిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, నెక్కొండ తహసీల్దార్‌ రాజ్‌కుమార్, గురుకుల పాఠశాల ప్రత్యేక అధికారి, ఎంపీడీవో లావణ్య విచారణ చేపట్టారు. అధికారుల ముందు చిన్నారులు తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. అనంతరం అధికారులు విద్యార్థునులు, ప్రిన్సిపాల్, టీచర్‌ రజినీ నుంచి వివరాలను రికార్డు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button