KhammamPoliticalSathupallyTelangana

కాలువలో దూకి ప్రభుత్వ టీచర్ ఆత్మ*హత్య

కాలువలో దూకి ప్రభుత్వ టీచర్ ఆత్మ*హత్య

కాలువలో దూకి ప్రభుత్వ టీచర్ ఆత్మ*హత్య

Web desc : సత్తుపల్లి: పెనుబల్లి మండలం తుమ్మలపల్లి గ్రామ సమీపంలో నాగార్జున సాగర్ కాలువలో దూకి ఉపాధ్యాయుడు ఆత్మహత్య చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం కొత్త కారాయి గూడెం గ్రామానికి చెందిన దొడ్డపనేని వెంకటేశ్వరరావు (45) స్కూల్ అసిస్టెంట్‌గా గణేష్ పాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు.

ఆదివారం సాయంత్రం తుమ్మలపల్లి సమీపంలోని నాగార్జున సాగర్ కాలువ వద్దకు వెళ్లి మృతికి గల కారణాలు వివరిస్తూ సూసైడ్ నోట్ రాసి.. దగ్గర ఉన్న వస్తువులను కాలువ గట్టుపై ఉంచి కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న పెనుబల్లి ఎస్ఐ షాకీర్ ఆధ్వర్యంలో రాత్రి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టగా లభ్యం కాకపోవటంతో సోమవారం ఉదయం 7 గంటల సమయంలో మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య దొడ్డపనేని విజయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయుడు మృతి చెందటంతో పండగ పూట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button