
యువతితో అసభ్య ప్రవర్తన ..బిల్డింగ్ పై నుంచి తోసేసిన జిమ్ ట్రైనర్
Web desc : ముషీరాబాద్ : ఎదురింటి ఫ్లాట్‌లో ఉండే యువతిపై ఓ డీఆర్డీవో ఉద్యోగి లైంగికదాడికి ప్రయత్నించగా..అతడిని కొట్టి బిల్డింగ్‌పై నుంచి తోసేశాడో యువకుడు దీంతో తల పగిలి తీవ్రంగా గాయపడ్డ అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. డీఆర్డీవోలో పర్సనల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రాంమోహన్(55) చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలోని ఓ అపార్ట్మెంట్ఫస్ట్ఫ్లోర్లో రెండు సంవత్సరాలుగా కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడు.
ఇతడు కొద్ది రోజులుగా ఇంటి పక్కనే ఉన్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. బుధవారం రామ్మోహన్ కుటుంబ సభ్యులు దసరాకు కరీంనగర్ వెళ్లగా ఆయన ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్నారు. అదే అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తులో ఉంటున్న 22 ఏండ్ల యువతి తల్లి, సోదరి బయటకు వెళ్లడం గమనించాడు.
వెంటనే ఆమె ఫ్లాట్‌కు వెళ్లి మంచినీళ్లు అడిగి తాగాడు. వెళ్లిపోయాక కొద్దిసేపటికి మళ్లీ స్వీట్స్‌తో వచ్చాడు.అయితే, ఆ యువతి నిరాకరించగా, ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో భయపడ్డ ఆమె గట్టిగా కేకలు వేసింది. వెంటనే పక్క బిల్డింగ్‌లో ఉండే 35 ఏండ్ల జిమ్ట్రైనర్అభిజిత్కు చెప్పింది. వెంటనే అతడు రాంమోహన్ఫ్లాట్కు వెళ్లి ఈ విషయమై నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఆగ్రహానికి గురైన రాంమోహన్ ముఖంపై బలంగా కొట్టాడు. తర్వాత కోపంతో తోసెయ్యగా, బిల్డింగ్‌పై నుంచి పడిపోయాడు. దీంతో రాంమోహన్ తీవ్రంగా గాయపడగా ఓ ప్రైవేట్దవాఖానకు తరలించారు.అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. రాంమోహన్ భార్య కాత్యాయిని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ చిక్కడపల్లి సీఐ మధుబాబు తెలిపారు. అభిజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.




