PoliticalTelanganaYadadri

మహిళపై సర్పంచ్ దాడి.. అడ్డుబోయిన కానిస్టేబుల్ పైనా దాడికి యత్నం.. కానిస్టేబుల్ కు గాయాలు

మహిళపై సర్పంచ్ దాడి.. అడ్డుబోయిన కానిస్టేబుల్ పైనా దాడికి యత్నం.. కానిస్టేబుల్ కు గాయాలు

మహిళపై సర్పంచ్ దాడి.. అడ్డుబోయిన కానిస్టేబుల్ పైనా దాడికి యత్నం.. కానిస్టేబుల్ కు గాయాలు

Web desc : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాత కక్షలను మనసులో పెట్టుకుని గ్రామ సర్పంచ్ కంబంపాటి శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి వీరంగం సృష్టించాడు. ఓ మహిళపై హత్యాయత్నానికి పాల్పడటమే కాక అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసు కానిస్టేబుల్పై కూడా దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

పల్లివాడ సర్పంచ్ కంబంపాటి శ్రీనివాసు, స్థానికంగా ఉంటున్న ఓ మహిళ కుటుంబానికి కొంతకాలంగా రాజ కీయ, వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో సర్పంచ్ తన అనుచరులతో కలిసి మహిళపై భౌతిక దాడికి దిగి, హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న రామన్నపేట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించగా పోలీసు సిబ్బందిపై నిందితులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పోలీసులపైనే సర్పంచ్ వర్గం దాడికి పాల్పడటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై సర్పంచ్ శ్రీనివాస్, ఆయన అనుచరులపై హత్యాయత్నం, విధుల్లో ఉన్న పోలీసులపై దాడి, అల్లర్లు సృష్టించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button