Bhadradri KottagudemPoliticalTelangana

చిల్లర కోసం కదులుతున్న బస్సులోంచి కండక్టర్‌ను తోసేసిన మహిళ..

చిల్లర కోసం కదులుతున్న బస్సులోంచి కండక్టర్‌ను తోసేసిన మహిళ..

చిల్లర కోసం కదులుతున్న బస్సులోంచి కండక్టర్‌ను తోసేసిన మహిళ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో టికెట్ విషయంలో ప్రయాణికురాలికి, కండక్టర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఈ తోపులాటలో ప్రయాణికురాలు నెట్టేయడంతో కండక్టర్ రోడ్డుపై పడిపోగా, బస్సు టైరు ఆమె కాళ్లపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కండక్టర్‌ను వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అశ్వాపురం పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మణుగూరులో మౌనిక అనే మహిళ తన కుమారుడితో కలిసి టీఎస్‌జీఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సు ఎక్కింది. కుమారుడికి టికెట్ కొనుగోలు చేసే సమయంలో మౌనిక రూ. 100 నోటు ఇవ్వగా.. కండక్టర్ ప్రవళికతో చిల్లర విషయమై వాగ్వాదం జరిగింది. అనంతరం అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామంలో బస్సు దిగే సమయంలోనూ ఇద్దరి మధ్య మళ్లీ గొడవ తలెంది.

ఈ క్రమంలో ఆగ్రహం పట్టలేకపోయిన ప్రయాణికురాలు మౌనిక.. కండక్టర్ ప్రవళికను నడుస్తున్న బస్సు నుంచి తోసింది. అదే సమయంలో బస్సు చక్రాలు ఆమె కాళ్లపై నుంచి వెళ్లడంతో కుడి కాలు తీవ్రంగా విరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాధితురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలు మౌనికను అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత పూచీకత్తుపై విడుదల చేసినట్లు తెలిపారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిపై దాడి చేసి గాయపరిచినందుకు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 121 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button