
రాహుల్ గాంధీ కి తృటిలో తప్పిన ప్రమాదం…
Web desc : రాహుల్ గాంధీ కాన్వాయ్‌లోని వాహనాలు, ఒక అంబులెన్స్ ఢీకొన్నాయి. ఈ ఘటన సోమవారం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు, ఒక అంబులెన్స్ ఒకదానికొనడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు, కొంతమంది భద్రతా సిబ్బందితో సహా పలువురు గాయపడ్డారు.
సుల్తాన్‌పూర్‌లోని కోర్టు తీర్పు నిమిత్తం ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. లక్నో విమానాశ్రయం నుంచి సుల్తాన్‌పూర్‌కు ప్రయాణిస్తుండగా, హలియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో రాహుల్ గాంధీకి ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఆయన క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు సమాచారం. కాగా, కేంద్ర మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 2018లో నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసులో తీర్పు కోసం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఎదుట హాజరయ్యేందుకు సుల్తాన్‌పూర్‌కు బయలుదేరారు.




