
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ అధికారి
Web desc : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు తీవ్ర కలకలం రేపాయి. లంచం తీసుకుంటూ లీగల్ మెట్రాలజీ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు ఏసీబీ వలలో చిక్కారు.
బాధితుడు చింతల యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం పెట్రోల్ బంకు అనుమతులకు సంబంధించి లీగల్ మెట్రాలజీ శాఖ నుంచి క్లియరెన్స్ కోసం అధికారి వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లగా, పని చేసి పెట్టేందుకు ఆయన లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.20,000 ముట్టజెప్పాలని తేల్చిచెప్పారు. దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కావ్యూహం రచించిన ఏసీబీ బృందం బాధితుడి నుంచి వెంకటేశ్వర్లు రూ.20 వేల నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఆయన కార్యాలయానికి ఏసీబీ అధికారులు తీసుకువచ్చి విచారణ చేపడుతున్నారు.




