EntertainmentPoliticalTelangana

మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధింపులు.. విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం!

మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధింపులు.. విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం!

మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధింపులు.. విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం!

Web desc : సినీ తారలకు అభిమానుల నుంచి ప్రేమాభిమానాలు అందడం సహజం. అయితే కొందరి అత్యుత్సాహం మాత్రం సెలబ్రిటీలను ఇబ్బందుల్లోకి నెడుతోంది. లేటెస్ట్ గా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌కు విమాన ప్రయాణంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.

మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు సెల్ఫీ కోసం ఆమెను పదేపదే ఇబ్బంది పెట్టడంతో పరిస్థితి విమాన సిబ్బంది జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన గురించి కీర్తి స్వయంగా వెల్లడించడంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

కీర్తి సురేశ్ తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి మిలాన్ నుంచి భారత్‌కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు ఆమె దగ్గరకు వచ్చి సెల్ఫీ అడిగాడట. అయితే అతడు మద్యం మత్తులో ఉండటంతో సరిగ్గా నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడని కీర్తి చెప్పారు. దీంతో కాసేపు ఆగాలని ఆమె సూచించినప్పటికీ, అతడు వినకుండా వెంటనే ఫొటో దిగాలని పట్టుబట్టాడని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో కీర్తి అతడికి స్పష్టంగా సమాధానం చెప్పినట్లు వెల్లడించారు. తనతో ఎప్పుడు సెల్ఫీ తీసుకోవాలనేది ఇతరులు నిర్ణయించలేరని, తనకు అనుకూలంగా ఉన్నప్పుడే ఫొటో దిగుతానని చెప్పారు. అయినప్పటికీ ఆ ప్రయాణికుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమె భర్త ఆంటోనీ కూడా అతడిని వారించే ప్రయత్నం చేశారని తెలిపారు.

చివరకు పరిస్థితిని విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చిందని కీర్తి వివరించారు. అయితే ఈ ఘటనతో అభిమానులందరినీ ఒకేలా చూడలేమని కీర్తి పేర్కొన్నారు. తనను ఎంతో ఆప్యాయంగా పలకరించే అభిమానులు చాలామంది ఉన్నారని, కొందరు సెల్ఫీ అడగకుండా కేవలం మాట్లాడి తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారని గుర్తుచేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button