
పాతర్లపాడు గ్రామ మాజీ సర్పంచ్ సామినేని రామారావు
హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట –
అనుభవజ్ఞులైన పోలిస్ అధికారుల పర్యవేక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పోరెన్సిక్ ఆధారాలతోదర్యాప్తు.
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, పాతర్లపాడు గ్రామానికి చెందిన సామినేని రామారావు. వయస్సు 72 సంవత్సరాలు, 31.10.2025 తేదీన తెల్లవారుజామున తన ఇంటి పక్కన ఉన్న కొట్టంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై చింతకాని పోలీస్ స్టేషన్లో Cr. No. 324/2025, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) మరియు సెక్షన్ 190 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్ మరియు ఫోరెన్సిక్ సైన్స బృందం సహాయంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులకు సంబంధించినవిగా అనుమానిస్తున్న చెప్పులు మరియు కాలి ముద్రలు, ఎరుపు రంగు వస్త్రపు ముక్క, తెలుపు రంగుపై నల్లని గీతలు ఉన్న వస్త్రపు ముక్క, కత్తి కవర్లో పాటు ఇతర భౌతిక ఆధారాలను సేకరించారు. మృతుడి శరీరంపై ఉన్న గాయాలు, సంఘటనా స్థల పరిస్థితులు మరియు సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిశీలించారు.
సాంకేతిక ఆధారాల విశ్లేషణ
నిందితులను గుర్తించేందుకు పోలీసులు విస్తృత స్థాయిలో సాంకేతిక దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా, ఫిర్యాదులో పేర్కొన్న అనుమానితులు, సాక్షులు మరియు ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ఆధారంగా గుర్తించిన మొత్తం 24 మంది వ్యక్తులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు ఖమ్మంలోని గౌరవనీయ III అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును అనుమతి కోరారు, కోర్టు సమన్లు అందుకున్న వారిలో ఆరుగురు అనుమానితులు స్వచ్ఛందంగా పరీక్షలకు సమ్మతి తెలిపారు. తదనుగుణంగా, 2026 జనవరి నెలలో కర్ణాటక రాష్ట్రం, బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల నివేదికలను దర్యాప్తులో సేకరించిన ఇతర ఆధారాలతో కలిపి పరిశీలించగా, కొన్ని సంబంధిత ఆధారాలు లభించాయి.
దర్యాప్తును మరింత బలోపేతం చేసేందుకు గుజరాత్ రాష్ట్రం, గాంధీనగర్ లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (NFSU) నిపుణుల సహాయం కోరారు. ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం ఖమ్మంకు వచ్చి ఫోరెన్సిక్ విశ్లేషణ నిర్వహించింది. ఈ విశ్లేషణ ద్వారా లభించిన సమాచారాన్ని కేసులో అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలతో కలిపి పరిశీలించారు.
నలుగురు నిందితుల
దర్యాప్తులో సేకరించిన భౌతిక మరియు సాంకేతిక ఆధారాలు, ఇతర సంబంధిత సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం నలుగురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.
అరెస్టయిన నిందితుల వివరాలు
A-1) బోడపట్ల శ్రీనివాసరావు @ మెంటల్ శ్రీను, తండ్రి: పుల్లయ్య (లేట్), వయస్సు: 34 సంవత్సరాలు, కులం: గౌడ్, వృత్తి: మేస్త్రీ పని, నివాసం: మాలముత్యాలమ్మ సెంటర్, తెల్డారుపల్లి గ్రామం, ఖమ్మం రూరల్ మండలం.
A-2) నూకల లింగయ్య, తండ్రి: సైదులు (లేట్), వయస్సు: 43 సంవత్సరాలు, కులం: యాదవ, వృత్తి: వ్యవసాయం, నివాసం: చావడి సెంటర్, తెల్డారుపల్లి గ్రామం, ఖమ్మం రూరల్ మండలం.
A-3) మల్లారపు లక్ష్మయ్య, తండ్రి: రామయ్య (లేట్), వయస్సు: 24 సంవత్సరాలు, కులం: గౌడ్, వృత్తి: పెయింటర్ పని, నివాసం: తెల్దారుపల్లి గ్రామం, ఖమ్మం రూరల్ మండలం.
A-4) కార్లపూడి ఉదయ్ కుమార్ @ రుక్మాన్ కుమార్. తండ్రి ఆదినారాయణ, వయస్సు: 39 సంవత్సరాలు, కులం: మాల, వృత్తి: పెయింటింగ్ పని, నివాసం: తెల్దారుపల్లి గ్రామం, ఖమ్మం రూరల్ మండలం.
నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు
- నేరానికి ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్న రెండు కత్తులు.
- నిందితులు రెక్కీ నిర్వహించే సమయంలో ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్న నాలుగు సెల్ ఫోన్లు.
దర్యాప్తులో పాల్గొన్నఅధికారులు - పర్యవేక్షణ మరియు దర్యాప్తు బృందం
శ్రీ ఎస్. సారంగపాణి, ACP, వైరా దర్యాప్తుపై సమగ్ర పర్యవేక్షణ అధికారి.
శ్రీ వై. వెంకట ప్రసాద్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలిస్, వైరా దర్యాప్తు అధికారి.
శ్రీ వీరేందర్ మరియు శ్రీ జి. నరేష్. సబ్ ఇన్స్పెక్టర్లు ఆఫ్ పోలిస్ సహాయ దర్యాప్తు అధికారులు, దర్యాప్తులో విశేష ప్రతిభ కనబరిచిన వైరా ACP శ్రీ ఎస్. సారంగపాణి, వైరా CI శ్రీ వై. వెంకట ప్రసాద్ మరియు బృందంలోని ఇతర అధికారులను ఖమ్మం పోలీస్ కమిషనర్ శ్రీ సునీల్ దత్ అభినందించి, వారికి రివార్డులు అందజేశారు.పాతర్లపాడు గ్రామ మాజీ సర్పంచ్ సామినేని రామారావు
హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట –
అనుభవజ్ఞులైన పోలిస్ అధికారుల పర్యవేక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పోరెన్సిక్ ఆధారాలతోదర్యాప్తు.
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, పాతర్లపాడు గ్రామానికి చెందిన సామినేని రామారావు. వయస్సు 72 సంవత్సరాలు, 31.10.2025 తేదీన తెల్లవారుజామున తన ఇంటి పక్కన ఉన్న కొట్టంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై చింతకాని పోలీస్ స్టేషన్లో Cr. No. 324/2025, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) మరియు సెక్షన్ 190 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్ మరియు ఫోరెన్సిక్ సైన్స బృందం సహాయంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులకు సంబంధించినవిగా అనుమానిస్తున్న చెప్పులు మరియు కాలి ముద్రలు, ఎరుపు రంగు వస్త్రపు ముక్క, తెలుపు రంగుపై నల్లని గీతలు ఉన్న వస్త్రపు ముక్క, కత్తి కవర్లో పాటు ఇతర భౌతిక ఆధారాలను సేకరించారు. మృతుడి శరీరంపై ఉన్న గాయాలు, సంఘటనా స్థల పరిస్థితులు మరియు సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిశీలించారు.
సాంకేతిక ఆధారాల విశ్లేషణ
నిందితులను గుర్తించేందుకు పోలీసులు విస్తృత స్థాయిలో సాంకేతిక దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా, ఫిర్యాదులో పేర్కొన్న అనుమానితులు, సాక్షులు మరియు ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ఆధారంగా గుర్తించిన మొత్తం 24 మంది వ్యక్తులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు ఖమ్మంలోని గౌరవనీయ III అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును అనుమతి కోరారు, కోర్టు సమన్లు అందుకున్న వారిలో ఆరుగురు అనుమానితులు స్వచ్ఛందంగా పరీక్షలకు సమ్మతి తెలిపారు. తదనుగుణంగా, 2026 జనవరి నెలలో కర్ణాటక రాష్ట్రం, బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల నివేదికలను దర్యాప్తులో సేకరించిన ఇతర ఆధారాలతో కలిపి పరిశీలించగా, కొన్ని సంబంధిత ఆధారాలు లభించాయి.
దర్యాప్తును మరింత బలోపేతం చేసేందుకు గుజరాత్ రాష్ట్రం, గాంధీనగర్ లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (NFSU) నిపుణుల సహాయం కోరారు. ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం ఖమ్మంకు వచ్చి ఫోరెన్సిక్ విశ్లేషణ నిర్వహించింది. ఈ విశ్లేషణ ద్వారా లభించిన సమాచారాన్ని కేసులో అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలతో కలిపి పరిశీలించారు.
నలుగురు నిందితుల
దర్యాప్తులో సేకరించిన భౌతిక మరియు సాంకేతిక ఆధారాలు, ఇతర సంబంధిత సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం నలుగురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.
అరెస్టయిన నిందితుల వివరాలు
A-1) బోడపట్ల శ్రీనివాసరావు @ మెంటల్ శ్రీను, తండ్రి: పుల్లయ్య (లేట్), వయస్సు: 34 సంవత్సరాలు, కులం: గౌడ్, వృత్తి: మేస్త్రీ పని, నివాసం: మాలముత్యాలమ్మ సెంటర్, తెల్డారుపల్లి గ్రామం, ఖమ్మం రూరల్ మండలం.
A-2) నూకల లింగయ్య, తండ్రి: సైదులు (లేట్), వయస్సు: 43 సంవత్సరాలు, కులం: యాదవ, వృత్తి: వ్యవసాయం, నివాసం: చావడి సెంటర్, తెల్డారుపల్లి గ్రామం, ఖమ్మం రూరల్ మండలం.
A-3) మల్లారపు లక్ష్మయ్య, తండ్రి: రామయ్య (లేట్), వయస్సు: 24 సంవత్సరాలు, కులం: గౌడ్, వృత్తి: పెయింటర్ పని, నివాసం: తెల్దారుపల్లి గ్రామం, ఖమ్మం రూరల్ మండలం.
A-4) కార్లపూడి ఉదయ్ కుమార్ @ రుక్మాన్ కుమార్. తండ్రి ఆదినారాయణ, వయస్సు: 39 సంవత్సరాలు, కులం: మాల, వృత్తి: పెయింటింగ్ పని, నివాసం: తెల్దారుపల్లి గ్రామం, ఖమ్మం రూరల్ మండలం.
నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు
నేరానికి ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్న రెండు కత్తులు.
నిందితులు రెక్కీ నిర్వహించే సమయంలో ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్న నాలుగు సెల్ ఫోన్లు.
దర్యాప్తులో పాల్గొన్నఅధికారులు
పర్యవేక్షణ మరియు దర్యాప్తు బృందం
శ్రీ ఎస్. సారంగపాణి, ACP, వైరా దర్యాప్తుపై సమగ్ర పర్యవేక్షణ అధికారి.
శ్రీ వై. వెంకట ప్రసాద్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలిస్, వైరా దర్యాప్తు అధికారి.
శ్రీ వీరేందర్ మరియు శ్రీ జి. నరేష్. సబ్ ఇన్స్పెక్టర్లు ఆఫ్ పోలిస్ సహాయ దర్యాప్తు అధికారులు, దర్యాప్తులో విశేష ప్రతిభ కనబరిచిన వైరా ACP శ్రీ ఎస్. సారంగపాణి, వైరా CI శ్రీ వై. వెంకట ప్రసాద్ మరియు బృందంలోని ఇతర అధికారులను ఖమ్మం పోలీస్ కమిషనర్ శ్రీ సునీల్ దత్ అభినందించి, వారికి రివార్డులు అందజేశారు.



