HyderabadPoliticalTelangana

సైబర్ మోసగాళ్ల వలలో కానిస్టేబుల్.. అధిక లాభాల పేరుతో రూ.29 లక్షలు టోకరా

సైబర్ మోసగాళ్ల వలలో కానిస్టేబుల్.. అధిక లాభాల పేరుతో రూ.29 లక్షలు టోకరా

సైబర్ మోసగాళ్ల వలలో కానిస్టేబుల్.. అధిక లాభాల పేరుతో రూ.29 లక్షలు టోకరా

Web desc : సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ ఓ కానిస్టేబుల్.. అధిక లాభాలు వస్తాయన్న ఆశతో పెట్టుబడి పెట్టి రూ. 29 లక్షలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసముంటున్న శ్రీకాంత్.. కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూంటారు.

కొద్దిరోజుల క్రితం శ్రీకాంత్‌కు ఫేస్‌బుక్‌లో సుకన్యరెడ్డి అనే అమ్మాయి పరిచయమైంది. కొద్ది రోజుల స్నేహం తరువాత.. సుకన్యరెడ్డి శ్రీకాంత్‌ను సంప్రదించి డార్విన్ ఎక్స్ గ్లోబల్ యాప్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించింది. అధిక లాభాలు వస్తాయని నమ్మబలికింది. దీంతో శ్రీకాంత్.. విడతల వారీగా రూ. 29 లక్షలు పెట్టుబడి పెట్టారు.

లాభాలు వచ్చినట్లు చూపిస్తున్నప్పటికీ.. డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి మరో రూ.12 లక్షలు కట్టాలని సుకన్యరెడ్డి షరతు పెట్టింది. దీంతో మోసపోయానని గ్రహించిన కానిస్టేబుల్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button