HyderabadPoliticalTelangana

భార్యను చంపి ఆత్మ*హత్యగా చిత్రీకరణ... భర్త అరెస్ట్!

భార్యను చంపి ఆత్మ*హత్యగా చిత్రీకరణ... భర్త అరెస్ట్!

భార్యను చంపి ఆత్మ*హత్యగా చిత్రీకరణ… భర్త అరెస్ట్!

Web desc : ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. మనస్పర్థలతో పెద్దమనుషుల సమక్షంలో విడిపోయారు.. నాలుగు నెలల క్రితం మళ్లీ కలిసి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని న్యూ శాంతినగర్‌లో చోటుచేసుకుంది.

ప్రియాంక (22)ను ఆమె భర్త గుగులోత్‌ రాజశేఖర్‌ (26) గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ వై. రామలింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం నీలికుర్తి గ్రామంలోని బజనా తండాకు చెందిన రాజశేఖర్‌, ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరు జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి ఉప్పల్‌ న్యూ శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. రాజశేఖర్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ప్రియాంక గృహిణి. వీరికి ఒక కుమార్తె ఉంది. భార్య ప్రవర్తనపై అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో గతంలో పెద్దమనుషుల సమక్షంలో విడిపోయారు. నాలుగు నెలల క్రితం మళ్లీ కలిసిపోయి కలిసి ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో నవంబరు 11వ తేదీ తెల్లవారుజామున సుమారు 2.30 గంటలకు రాజశేఖర్‌ ప్రియాంకను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విచారణలో రాజశేఖరే హత్యకు పాల్పడినట్లు గుర్తించి అదే రోజు ఉప్పల్‌ బాగాయత్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ రామలింగారెడ్డి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button