
NIT వరంగల్‌లో జేఆర్ఎఫ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
Web desc : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (NIT Warangal) రీసెర్చ్ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు నిర్దిష్ట విద్యా అర్హతలను కలిగి ఉండాలి.
కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సైన్స్ లేదా ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్/ఎంఎస్ పూర్తి చేసి ఉండాలి. అలాగే, కనీసం 60 శాతం మార్కులతో సమాన కోర్సుల్లో ఎంఎస్సీ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు కనీసం 70 శాతం మార్కులతో పాటు మెటీరియల్స్ సంబంధిత స్పెషలైజేషన్ కలిగి ఉండటం తప్పనిసరి.ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. అర్హులైన అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రతిభావంతులైన యువతకు ఇది మంచి రీసెర్చ్ అవకాశం అని చెప్పవచ్చు.
ఈ జేఆర్ఎఫ్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా తమ దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి నవంబర్ 29 తుది గడువుగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక మార్గదర్శకాల కోసం అభ్యర్థులు nitw.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.




