HyderabadPoliticalTelangana

మహిళపై కామాంధుల సామూహిక అత్యాచారం...

మహిళపై కామాంధుల సామూహిక అత్యాచారం...

మహిళపై కామాంధుల సామూహిక అత్యాచారం…

Web desc : హైదరాబాద్ శివారులో దారుణ ఘటన జరిగింది. బధిర మహిళపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరిని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను గదిలో బంధించి వారిద్దరు అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌లో కుటుంబంతో కలిసి బాధితురాలు నివాసం ఉంటోంది. కుమారుడిని బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా మహిళపై నిందితుడు కన్నేశాడు. ఆమె తల్లిదండ్రులకు అనారోగ్యమంటూ సయ్యద్ జావీద్ అనే పరిచయస్తుడు నమ్మించాడు. తల్లిదండ్రులను చూపిస్తానంటూ ఆటోలో తీసుకెళ్లి మార్గమధ్యలో అతడు శీతలపానీయం ఇచ్చాడు.

ఈ ఘటన అనంతరం బాధితురాలు స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆమెకు మెలకువ వచ్చేసరికి గదిలో అభ్యంతరకరంగా.. చేతులు చున్నీతో కట్టేసిన స్థితిలో ఉంది. ఆ గదిలో సయ్యద్ జావీద్‌తో పాటు మరో నిందితుడు వెంకటేశ్ కూడా ఉన్నాడు. వీరిద్దరూ కలిసి మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం.

నిందితులు వెళ్లిపోయిన తర్వాత బాధితురాలు బయటకు వచ్చింది. ఆ తర్వాత తన తల్లి వద్దకు చేరుకుని ఈ ఘటన గురించి తెలిపింది. తనకు జరిగిన దారుణంపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button