KhammamPoliticalTelangana

యోగాతో ఆరోగ్యకరమైన జీవనం

యోగాతో ఆరోగ్యకరమైన జీవనం

యోగాతో ఆరోగ్యకరమైన జీవనం

ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యోగా శిక్షణ

విద్యార్థినీ విద్యార్థులకు యోగాసనాలు, ప్రాణాయామంపై అవగాహన

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు నవంబర్ 27 2026: విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రతను పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏన్కూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వారం రోజులుగా యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యోగా ఉపాధ్యాయురాలు కె. పూజిత ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో కళాశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు యోగాకు సంబంధించిన పలు అంశాలపై శిక్షణ అందిస్తున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు యోగా ప్రాముఖ్యత, వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం తదితర అంశాలను వివరిస్తూ వాటిని ఆచరించే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. యోగాసనాలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తూ విద్యార్థులతో సాధన చేయిస్తున్నారు. ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలియజేస్తున్నారు.
ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని, యోగా సాధన వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని శిక్షణ సందర్భంగా వివరించారు. విద్యార్థి దశ నుంచే యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి దోహదపడుతుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం. సింహాచలం, స్టూడెంట్ కౌన్సిలర్ చావా సాంబశివరావు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బి. రమాదేవి, యోగా ఉపాధ్యాయురాలు కె. పూజిత, అధ్యాపకులు విజయలక్ష్మి, రామారావు, లక్ష్మీనరసింహారావు, లైబ్రేరియన్ కవిత తదితరులు పాల్గొన్నారు. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button