
సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం.. పీజీ విద్యార్థిని రక్షించిన పోలీసులు
Web desc : హైదరాబాద్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయేందుకు యత్నించాడు పీజీ సోషియాలజీ చదువుతున్న స్టూడెంట్.
హాస్టల్ బిల్డింగ్ మూడో అంతస్తు ఎక్కి బాల్కనీలో ఉండడం, దూకేందుకు యత్నించడంతో యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు రాకపోతే యూనివర్సిటీలో పరిస్థితి మరోలా ఉండేది తోటి విద్యార్థులు, ప్రొఫెసర్లు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..
శుక్రవారం(నవంబర్ 27, 2026) హైదరాబాద్ యూనివర్సిటీ హాస్టల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అభినవ్ లక్రా అనే పీజీ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి కనిపించకుండాపోయాడు. దీంతో తోటి విద్యార్తులు డయల్ 100కు సమాచారం అందించారు.
స్పందించిన గచ్చిబౌలి పోలీసులు వెంటనే హైదరాబాద్ యూనివర్సిటీలోని ఎల్ మెన్స్ హాస్టల్కు చేరుకున్నారు. విద్యార్థికోసం హాస్టల్ అంతా వెదికారు. చివరికీ హాస్టల్ లని మూడో అంతస్తు బాల్కనీలో విద్యార్థి ఉన్నట్లు గుర్తించారు. అతడు బిల్డింగ్ పైనుంచి దూకేందుకు యత్నించగా పోలీసులు చాకచక్యంగా కాపాడారు.
అనంతరం విద్యార్థిని యూనివర్సిటీ సేఫ్ టీంకు అప్పగించి కౌన్సెలింగ్ ఇచ్చారు.హైదరాబాద్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ సోషియాలజీ మాస్టర్స్ చదువుతున్న అభినవ్ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థి యూపీకి చెందినవాడిగా యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెబుతున్నారు.




