KamareddyPoliticalTelangana

మద్యపానం నిషేధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు…

మద్యపానం నిషేధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు…

మద్యపానం నిషేధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు…

మద్యం తాగితే లక్ష జరిమానా, ఏడు చెప్పు దెబ్బలు అంటూ తీర్మానం

మద్యపాన నిషేధంలో భాగంగా కొన్ని గ్రామాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుని మిగితా గ్రామలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట్ మండలంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్, గుడి తండా, షేర్ శంకర్ తండా గ్రామస్తులు ఇటీవల మద్యపానం నిషేధించారు.

ఆ గ్రామాలను ఆదర్శంగా తీసుకొని రాజంపేట మండలంలోని గుండారం గ్రామ పరిధిలోని మరో మూడు గ్రామపంచాయతీల గ్రామస్తులు శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి మద్యపానం నిషేధిస్తూ ఒప్పంద పత్రం రాసుకున్నారు. కొన్ని గ్రామాలు చిన్న గ్రామాలైన వారు తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పది. గ్రామంలో చుక్క కనబడితే చుక్కలే అంటూ పసందైన శిక్షలతో గ్రామాలు ముందుకొస్తున్నాయి.

గ్రామాల్లో మద్యపానం నిషేధించడం అంత ఆశామాషి వ్యవహారం కాదని, వాళ్ల నిర్ణయాల వల్ల గ్రామాల్లో గొడవలు, అప్పులు, నేరాలు ప్రమాదాలు తగ్గుతాయని గ్రామస్తులు భావించి మంచి నిర్ణయం తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని గుండారం పరిధిలోని గ్రామ పంచాయతీలైన గుండారం, ఎల్లాపూర్ తాండ, నమితండ మూడు గ్రామస్తులు ప్రజలు గుండారం గ్రామంలోని ఎల్లమ్మ గుడి వద్ద శుక్రవారం సమావేశమై ఏకతాటిపై మూడు గ్రామాల్లో మద్యపాన నిషేధం అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ మూడు గ్రామాలు కలిసి సమిష్టిగా ఒప్పంద పత్రం రాసుకున్నాయి. ఒప్పంద పత్రం రాసుకున్న వివరాల ప్రకారం మద్యపానానికి పూర్తిగా నిషేధిస్తూ తీర్మానం రాశారు.

ఎవరైనా మద్యం అమ్ముతే లక్ష రూపాయలు జరిమానాలతో పాటు ఏడు చెప్పు దెబ్బలు విధించబడునని హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మితే పట్టించిన వారికి రూ.20 వేల నగదు బహుమతి అందించబడునని తెలియజేశారు.

గ్రామంలో ఎవరైనా దొంగతనాన్ని మద్యం కొన్న, గ్రామ శివారులలో మద్యం సేవించిన వారిని దొరకబట్టి గ్రామ ఆలయాల ముందు ఏడు చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పబడునని తెలిపారు. ఈ మద్యపాన నిషేధం అమలు చేయడానికి గ్రామానికి ఇద్దరు చొప్పున సభ్యులను ఎంపిక చేసి వారి నంబర్లను గ్రూపులలో షేర్ చేశారు.

గ్రామంలో మద్యం అమ్మిన,సేవించిన ఈ కమిటీ సభ్యులకు ఫోన్ చేసి తెలియజేయాలని ఒప్పంద పత్రంలో రాసుకున్నారు. ఇలా గ్రామాలు మద్యపానం నిషేధిస్తూ నేటి తరానికి ఎంతో ప్రయోజనం చేకూర్తుందని, గ్రామస్తులందరూ పూర్తిగా తమ పనుల్లో నిమగ్నమై ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి.

గ్రామ పెద్దల ఆలోచన భవిష్యత్తు తరాల మార్గం నిర్దేశాలుగా మారతాయని, కష్టసుఖాల్లో తోడు ఉంటూ, క్రైమ్ రేట్ ను తగ్గించుకుంటూ, రాష్ట్రంలోని మిగతా గ్రామాలకు, తమ గ్రామాలు ఆదర్శంగా నిలవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button