PoliticalTelangana

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం ఖాయం

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం ఖాయం

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం ఖాయం

బెల్ట్ షాపులను మూసి వేయించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న మహిళలు

వల్లబోతు నారాయణ

సికె న్యూస్ చౌటుప్పల్ మండల ప్రతినిధి ( శ్రీనివాస్)జనవరి 23

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి త్వరలోనే మంత్రి పదవి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ ధర్మోజి గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లబోతు నారాయణ ధీమా వ్యక్తం చేశారు.

చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన ఘనత రాజగోపాల్ రెడ్డి సొంతమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవడంలో రాజగోపాల్ రెడ్డి చేసిన కృషి అమోఘమన్నారు.

పార్టీలకతీతంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సాయం చేయడంలో రాజగోపాల్ రెడ్డి ముందుంటారన్నారు. గత ప్రభుత్వంలో గల్లీకో బెల్ట్ షాపు నిర్వహించడంతో యువత మద్యానికి బానిసలవుతున్నారని,

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే
బెల్ట్ షాపులను మూసివేయాలని చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. బెల్ట్ షాపులను మూసి వేయించడంతో మహిళలు సంతోషంగా ఉన్నారని, ఆ సంతోషానికి కారణం రాజగోపాల్ రెడ్డి అన్నారు.

రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అన్ని విధాలుగా అర్హుడని, మంత్రి పదవి వరిస్తే రాజగోపాల్ రెడ్డి ప్రజలకు మరిన్ని సేవలు చేస్తారన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button