EducationNotificationPoliticalTelangana

ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల..

ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల..

ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల..

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ లో (EMRS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు 7,267. ఇందులో టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హతలు, ఫీజు, జీతం, దరఖాస్తు విధానం తదితర వివరాల గురించి తెలుసుకుందాం.. డిగ్రీ, పీజీ, బీఎడ్, డిప్లొమా పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

సెప్టెంబర్ 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో మాత్రమే అప్లికేషన్ సమర్పించాలి.

PGT 1,460, TGT 3,962, ప్రిన్సిపల్​ 225, హాస్టల్ వార్డెన్​ 346, జూనియర్​ క్లర్క్​​ 228, అకౌంటెంట్​ 61, స్టాఫ్​ నర్స్​ 550, ఫీమేల్​ వార్డెన్ ​289, ల్యాబ్​ అటెండెంట్​ 146 పోస్టులున్నాయి. పూర్తి వివరాలకు https://nests.tribal.gov.inను సంప్రదించండి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

అర్హత : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ, బీఈడీ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్‌, ఇంటర్‌, టెన్త్‌, డిప్లొమాలో పాస్ అయి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి:
ప్రిన్సిపల్ పోస్టులకు 50 ఏళ్లు
పీజీటీకి 40 ఏళ్లు
టీజీటీకి 35 ఏళ్లు
అకౌంటెంట్‌కు 30 ఏళ్లు
ల్యాబ్‌ అటెండెంట్‌కు 30 ఏళ్లు
హాస్టల్‌ వార్డెన్‌, ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌కు 35 ఏళ్లు
జూనియర్ సెక్రటేరియట్‌ అటెండెంట్‌కు 30 ఏళ్లు.

జీతం: నెలకు
ప్రిన్సిపల్‌కు రూ.78,800 – రూ.2,09,200
పీజీటీకి రూ.47,600 – రూ.1,51,100
టీజీటీకి రూ.44,900 – రూ.1,42,400
అకౌంటెంట్‌కు రూ.35,400 – రూ.1,12,400
ల్యాబ్‌ అటెండెంట్‌కు రూ.18,000 – రూ.56,900
హాస్టల్‌ వార్డెన్‌కు రూ.29,200 – రూ.92,300
ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌కు రూ.29,200 – రూ.92,300
జూనియర్ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు రూ.19,900 – రూ.63,200.

దరఖాస్తు ఫీజు:

జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ప్రిన్సిపల్‌ పోస్టుకు రూ.2,500

టీజీటీ, పీజీటీ పోస్టులకు రూ.2,000

నాన్‌-టీచింగ్‌ పోస్టులకు రూ.1,500

ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌, మహిళా అభ్యర్థులకు రూ.500.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button