PoliticalsuryapetaTelangana

బీ ఫామ్ కోసం పెట్రోల్ పోసుకున్న కాంగ్రెస్ కార్యకర్త…

బీ ఫామ్ కోసం పెట్రోల్ పోసుకున్న కాంగ్రెస్ కార్యకర్త…

బీ ఫామ్ కోసం పెట్రోల్ పోసుకున్న కాంగ్రెస్ కార్యకర్త…

కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న వారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీగా ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవడంతో కాంగ్రెస్ పార్టీల నుంచి బీఫారంను పొందేందుకు అభ్యర్థులు తహతహలాడుతున్నారు.

ఆదివారం 11 వ వార్డు రాయని గూడెం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టిక్కెట్ ఎల్గూరి ఇందిరకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు నిరసన చేపట్టిన విషయం మరవక ముందే సోమవారం ఉదయం 25 వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి కోడి శివకు టికెట్ ఇవ్వాలని కోరుతూ పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఆశిస్తున్న కోడి శివ మీడియా ముందు ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోలు పోసుకున్నాడు. దీంతో కొద్దిసేపు ఉదృత వాతావరణం చోటుచేసుకుంది.

గతంలో టికెట్ ఇస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ఇవ్వనని తనను ఆవేదనకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. టైగర్ దామన్న బ్రతికి ఉంటే తనకు టికెట్ ఇచ్చేవాడని ఇప్పుడు గ్రూపు రాజకీయాలతో తనకు టికెట్ రావడం లేదని ఆయన వాపోయారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button