
మేడారం జాతరలో రేప్ జరిగిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధం
తప్పుడు వార్తలతో మా చెల్లి జీవితాన్ని నాశనం చేయొద్దు
తప్పుడు ప్రచారంపై కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం- హెచ్చరించిన బాలిక అన్నయ్య
Web desc : మేడారం జాతరలో ఓ బాలికపై రేప్ జరిగినట్లు ఒక వర్గం మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని బాధితురాలిగా ప్రచారం జరుగుతున్న బాలిక అన్నయ్య స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేసి, తప్పుడు వార్తలతో ఒక ఆడపిల్ల జీవితాన్ని అనవసరంగా నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారంపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆ రోజు జరిగిన వాస్తవాలను ఆయన వివరించారు. ఆయన మాటల్లోనే— “డాబర్ పేస్ట్ ఉచిత పంపిణి స్టోర్ దగ్గర చిన్న దొంగతనం జరిగింది. చోరికి పాల్పడ్డ యువతిని పట్టుకుని కొందరు కొట్టారు.
అక్కడే ఉన్న తన చెల్లి, వదిన ఏం జరుగుతుందో అని చూస్తున్నారు. అప్పుడే అక్కడ ఉన్న కొందరు మా చెల్లి, వదిన ను చోరికి పాల్పడ్డ యువతి సంబంధికులు అనుకుని చేయి లాగి కొట్టారు. వెంటనే నేను, మా నాన్న వెల్లి అడ్డుకుని ఎందుకు మా వాల్లని కొడుతున్నారని ప్రశ్నించారు.




