
మోహన్ బాబు, విష్ణు ల పై కేసు నమోదు…
Web desc : తిరుపతిలోని తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో ఎంబీయూ (MBU) యాజమాన్యంపై కేసు నమోదు అయింది.
ఈ కేసులో నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణు, అలాగే యూనివర్సిటీ పీఆర్‌వో సతీష్ పేర్లు కూడా ఉన్నాయి.
విద్యార్థి సంఘం నేతలు అక్బర్, వినోద్ ఉదయం కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్లుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఎంబీయూ బౌన్సర్లు వారిని బలవంతంగా కిడ్నాప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై విద్యార్థి సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఫిర్యాదు ఆధారంగా మోహన్‌బాబు, విష్ణు సహా ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసు నేపథ్యంలో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి వర్గాలు, రాజకీయ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.




