HyderabadPoliticalTelangana

ఎల్బీనగర్‌లో వ్యభిచారం గుట్టు రట్టు..

ఎల్బీనగర్‌లో వ్యభిచారం గుట్టు రట్టు..

ఎల్బీనగర్‌లో వ్యభిచారం గుట్టు రట్టు..

Web desc :ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ లాడ్జిని అనుమతి లేకుండా ఓయో బోర్డులు ఏర్పాటు చేసి వ్యభిచార దందా నిర్వహిస్తున్న లాడ్జి పై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ బృందం దాడులు చేసింది.

ఈ కేసుకు సంబంధించి ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ కే. వినోద్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామినేని చౌరస్తా నుండి సిరీస్ రోడ్ లో శివగంగా కాలనీ ప్రధాన రహదారి పై ఉన్న వశిష్ఠ రెసిడెన్సీ లగ్జరీ రూమ్స్ లో అనుమతులు లేకుండా ఓయో బోర్డులు ఏర్పాటు చేసి హోటల్ యాజమాన్యం వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ పోలీసులు మల్కాజిగిరి యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ బృందం దాడులు నిర్వహించింది.

ఈ దాడులలో వ్యభిచారం చేస్తున్న మహిళ, విటుడు అభిలాష్ తో పాటు రిసెప్షనిస్ట్ నారాయణ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. వీరి వద్ద నుండి కండోమ్ ప్యాకెట్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని మహిళను ప్రజ్వల హోమ్ కు తరలించినట్లు తెలిపారు.

హోటల్ యజమాని హేమంత్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button